ఆదివారం 23 డిసెంబర్ 2012

ఢిల్లీ రేప్ కేస్ తో 100ఏళ్ళు వెనక్కు వెళ్లిన భారత్



ఢిల్లీ రేప్ కేసులో ఎగసిపడుతున్న నిరసన జ్వాలలు సమంజసంగానే కనబడుతున్నాయి. నిందితులు దొరికారు. వారిని నిలువునా ఉరి వేయవలసిందిగా కోరుతూ యువశక్తి చేసే ఉద్యమంలో అంతో ఇంతో న్యాయం కనిపిస్తోంది. వరంగల్ ఆసిడ్ కేస్ అప్పుడు కూడా యువతులిలాగే కోరారు. అప్పటి పోలీసు అధికారి నిందితులను ఎన్ కౌంటర్ చేసేయడంతో తిరిగి యాసిడ్ దాడులు పెద్దగా పునరావృతం కాలేదు. ఢిల్లీ రేప్ నిందుతలకు కూడా ఇలాంటి శిక్షే వేయాలి. కమలహాసన్ చెప్పినట్టు.. నిందుతులకు ఉరిశిక్ష వేయడం చట్టబద్ధమైన హత్య అవుతుంది. కాదనలేం. కానీ, ఇలా నిందితుల పట్ల సమాజం ఉదారంగా ఉండటం వల్ల మరిన్ని సిగ్గు చేటు కలిగించే అంశాలు వెలుగు చూస్తాయి. విదేశాల్లో ఉద్యోగాలు చేసుకునే వారికీ, చదువుకునే పిల్లలకు ఎలాగూ సరైన రక్షణ ఇవ్వ లేక పోతున్నాం. మొన్నటి మొన్న ఆస్ట్రేలియాలో జాతి పేరుతో ఓ మహిళ భారతీయులను  దూషిస్తూ రెచ్చి పోవడం తెలిసిందే. నిన్నటికి నిన్నఒక టాక్సీ డ్రైవర్ని దుబాయ్ లో కిరాయి తీసుకెళ్లిన వ్యక్తే హతమార్చిన వార్త విని చలించి పోయాం. అలాంటిది.. ఇండియాలో కూడా ఇలాంటి మానవత్వం తలదించుకునే సంఘటనలు నమోదయితే ఎలా? అందుకే ఢిల్లీ రేప్ కేస్ నిందితులకు ఉరి కాకున్నా అంతటి కఠిన శిక్ష అయితే తప్పకుండా పడాలి. లేకుంటే వచ్చే రోజుల్లో మన సోదరి, కుమార్తెలు ఎలాంటి చదువు సంధ్యలు, అభివృద్ధికి నోచుకోలేరు. ఇలాంటి అఘాయిత్యాలు ఎక్కువైతే, ఎంత చైతన్యవంతులైనా ఆడపిల్లను ఇంటి పట్టున ఉండటమే శ్రేయస్కరం అంటారు. ఇది నిజంగా దారుణం. ఒక్క ఢిల్లీ రేప్ ఉదంతం భారత్ ను వందేళ్ల వెనక్కు తీసుకెళ్లగల శక్తిమంతమైంది. ఎందుకంటే ఇంత సమాచార విప్లవం వర్ధిల్లుతోంది. ఐదు పోలీస్ చెక్ పోస్టులను దాటుకుని ఆ బస్సు ప్రయాణించింది. అయినప్పటికీ బాధిత యువతికి ఎలాంటి రక్షణ కల్పించలేక పోయిందీ సమాజం, ప్రభుత్వం. దానికి తోడు నిందితులు ఆమె మర్మావయవాలపై దాడి చేయడం అత్యంత దారుణం. ఇలాంటి నీచులను ఆ అమ్మాయికే గన్ ఇచ్చి కాల్పించేంత శిక్ష విధించాలి. లేకుంటే మనం మరింత వెనక్కు వెళ్లి పోతాం.
- తెలుగుశాల

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి